కుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన దోత్రె బాలాజీ (36) సోమవారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి గొడవ కాస్త పెద్దదిగా కావడంతో కుటుంబ సభ్యులు బాలాజీని ఇంట్లో ఉంచి బయటనుంచి గడియ పెట్టారు. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి ఎలాంటి శబ్ధం రాకపోవడంతో గడియ తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మంగళవారం మృతుని సోదరి పల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు భైంసా రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ పరిశీలించారు.


