బాసర: బాసర గోదావరినది వద్ద ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్‌లో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అడవి పందులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందే డ్ నుంచి సిద్దిపేటకు సుమారు 23 అడవి పందులను బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాహనంతో పాటు ఇద్దరిని భైంసా అటవీశాఖ కార్యాలయానికి తరలి ంచినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.శంకర్ పే ర్కొన్నారు. తనిఖీల్లో ఫారెస్ట్ బీట్ అధికారులు శివ, సంజయ్, చెక్‌పోస్ట్ వాచర్లు సద్దాం, న రేంద్ర, అనిమల్ ట్రాకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


