ఆదిలాబాద్‌టౌన్: రాయితీ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్‌కుమార్ తెలి పారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో వివరా లు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎ రోడ్రామ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా వె ళ్తున్న మ్యాక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో 6 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం లభ్యమైనట్లు తెలిపారు. నిందితులు ప్రజల వద్ద నుంచి బియ్యం సేకరించి అక్రమంగా మ హారాష్ట్రకు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ప్ర స్తుతం రాంనగర్‌లో నివాసం ఉంటున్న మహా రాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితికి చెందిన అరవింద్ కాశీనాథ్ జవాలే, ఆదిలాబాద్ పట్ట ణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పంకజ్ కుష్వాహా, కోలిపూరకు చెందిన షేక్ కబీర్‌ను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వివరించారు.
విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుదాఘాతంతో బావిలో పడి కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్‌కు చెందిన సీపెల్లి రాజయ్య (48) మంగళవారం తన భార్యతో కలిసి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో ఉన్న బావిలో ఏర్పాటు చేసిన మోటార్ తక్కువ నీళ్లు పోస్తుందని అందులోకి దిగి మోటార్‌ను పరిశీలిస్తుండగా షాక్‌కు గురై నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
హోంగార్డు ఆత్మహత్య
మందమర్రిరూరల్: పట్టణంలోని మూడవ జోన్‌లో నివసించే హోంగార్డు వేముల లక్ష్మణ్(46) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్‌కు భార్య స్రవంతితో గొడవలు ఉండగా కేసు నమోదైంది. నాలుగు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటి వద్ద ఒక్కడే ఉంటున్నాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన మిత్రుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతడు పోలీసులకు తెలియజేయగా సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. అతడికి భార్య భార్య, కుమారుడు ఉన్నారు.
అత్యాచారం, హత్య
కేసులో ఒకరికి జీవితఖైదు
నిర్మల్‌టౌన్: బాలుడిపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధి స్తూ.. నిర్మల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యా యమూర్తి ఎస్.శ్రీవాణి మంగళవారం తీర్పునిచ్చినట్లు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. రూరల్ మండలంలోని చిట్యాల్ గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ అలియాస్ రాజు కొన్ని నెలల క్రితం ఓ బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేయడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి ఎస్సై లింబాద్రి, సీఐ రామకష్ణ, ఏఎస్పీ రాజేష్ మీనా దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.


