రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బండారి వినయ్‌ ఇటీవల జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగుపందెం పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 7నుంచి హన్మకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వినయ్‌ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్‌ ఆకిడి విజయ్‌సాగర్‌ తెలిపారు. సదరు విద్యార్థిని మంగళవారం కళాశాలలో అభినందించారు. ఈకార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ తన్నీరు గోపి, అధ్యాపకులు కమలాకర్‌, వర్మ, శ్రీనివాస్‌, పీఈటీలు అల్లూరి వామన్‌, ఎం.రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement