ఆదిలాబాద్(బేల): గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేల ఎస్సై మధుకృష్ణకు అందిన స మాచారం మేరకు మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కోర్పన తాలూకా తిప్ప గ్రామానికి చెందిన భీమా గోవింద్ ఆత్రం పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించాడు. అతన్ని తనిఖీ చేయగా, 10 గ్రాము ల ఎండిన గంజాయి లభించింది. విచారణలో తన కు చెందిన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మహారాష్ట్రలోని అతని వ్యవసాయ భూమికి వెళ్లి 14 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
గుడుంబా స్థావరాలపై దాడులు
బేల పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్‌పూర్‌లో మంగళవారం గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 20 లీటర్ల గుడుంబా మిశ్రమం, 30 కిలోల ఇప్పపువ్వు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ శ్రావణ్ తెలిపారు. రాథోడ్ ఈశ్వర్, పూసం లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


