డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం
ఆదిలాబాద్‌రూరల్: కాంగ్రెస్ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం మావలలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్‌లో శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్‌జాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం, నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణం, మండల కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా విద్యార్థుల ఉన్నత విద్యకోసం తలమడుగు మండలం కజ్జర్ల శివారులోని 800 ఎకరాల ప్రభుత్వ భూమిలో యూనివర్సిటీ జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు కోసం పీఏసీలో తీర్మానించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతిపాదిత కుప్టి నిల్వ సామర్థ్యాన్ని 6.5 టీఎంసీలకు పెంచి సాగు, తాగునీరు అందించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను భాగస్వాములను చేయడం తదితర తీర్మానాలు చేసినట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే తానే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ ఇన్‌చార్జిలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్, బోథ్, జైనథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్లు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మల్లెపూల సత్యనారాయణ, అల్లూరి అశోక్ రెడ్డి, కుమురం కోటేష్ , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, నాయకులు సాజిద్‌ఖాన్, సంజీవరెడ్డి, దిగంబర్‌రావు పాటిల్, అడ్డి భోజారెడ్డి, దామోదర్ రెడ్డి, గణేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
మండల కమిటీల కూర్పుపై ‘హస్తం’ దృష్టి
కై లాస్‌నగర్: పార్టీ పటిష్టతపై కాంగ్రెస్ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా సన్నద్ధమవుతుంది. ఇందు కోసం పార్టీ చేపట్టిన సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కమిటీల కూర్పునకు శ్రీకారం చుడుతుంది. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆదివారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు భోరజ్‌లో, 11గంటలకు జైనథ్‌లో, మధ్యాహ్నం 3గంటలకు బేలలో, సాయంత్రం 5 గంటలకు సాత్నాలలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఆయా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి మండల కార్యవర్గాలను ఖరారు చేయనున్నారు. ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాలను జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోరారు.


