ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఆ రోగ్య పాఠశాల, సీసీటీవీ ప్రారంభోత్సవానికి హాజ రై మాట్లాడారు. ప్రతి విద్యార్థి కనీసం 200 రోజులు ఖచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవా లన్నారు. త్వరలోనే మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పాఠశాలలో ఫిర్యాదులబాక్స్ ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నా రు. అనంతరం విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, అధికారులు ఆరోగ్య పాఠశాల అంశాలపై పాటలు, ప్రసంగం, నాటికల రూ పంలో అవగాహన కల్పించారు. ముందుగా పాఠశాలలో సీసీ కెమెరాలను కలెక్టర్ ప్రారంభించారు. సీసీ కెమెరాలు విరాళంగా ఇచ్చిన దాతలు మౌనీష్, శ్రీకాంత్ సేవలను, హెచ్‌ఎం నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఇందులో డీఈవో మాధవి, కౌన్సి ల ర్లు రజిత, మాన్కర్ నాక్సేన్, కాంప్లెక్ హెచ్‌ఎం సా ధన, ఏఏపీసీ చైర్మన్ రజియా సుల్తానా, దాతలు, వి ద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


