హెచ్‌ఐవీ రహిత జిల్లా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ రహిత జిల్లా లక్ష్యం

Jul 31 2026 11:59 PM | Updated on Jul 31 2026 11:59 PM

కై లాస్‌నగర్‌: జిల్లాను హెచ్‌ఐవీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల్లో బాధితులు, అనుమానితులకు హెచ్‌ఐవీ, సిఫిలిస్‌, హెపటైటిస్‌–బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనుమానితులను సమగ్ర తనిఖీ, కౌన్సెలింగ్‌ కేంద్రాలకు పంపించాలని, బాధితులకు క్రమం తప్పకుండా ఉచి త ఏఆర్‌టీ మందులు అందించాలన్నారు. బా ధితుల సమాచార గోప్యతను కఠినంగా కాపాడాలని సూచించారు. ముందుగా జిల్లా ప్రో గ్రాం మేనేజర్‌ నాగరాజు పవర్‌పాయింట్‌ ప్ర జెంటేషన్‌ ద్వారా జిల్లాలోని కార్యక్రమాల పు రోగతిని వివరించారు. అనంతరం మొబైలైజేషన్‌ ఫర్‌ ఎయిడ్స్‌ సురక్ష హ్యాండ్‌బుక్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో పి.సాధన, అదనపు డీఎంహెచ్‌వో ఈశ్వర్‌రాజ్‌, ఏఆర్‌టీ వైద్యులు పద్మిని ప్రియదర్శిని, డీఏపీసీయూ, ఐసీటీసీ, డీఎస్‌ఆర్‌సీ, ఏఆర్‌టీ, టీఐ, ఎల్‌డబ్ల్యూఎస్‌, సీఎస్సీ,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement