ఆదిలాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను వందశాతం గిరిజనులు నివసిస్తున్న గ్రామాలకు వర్తింపజేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఎంపీ గోడం నగేశ్ విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్డు గ్రామాలు కాకపోయినా, వందశాతం గిరిజనులు నివసిస్తూ కనీసం 250 జనాభా ఉన్న గ్రామాలకు కూడా వర్తింపజేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రహదారి సౌకర్యం ఎంతో కీలకమని, అర్హత ఉన్న ప్రతి గ్రామానికి కేంద్ర పథకాల ప్రయోజనం అందేలా కృషి చేయాలని విన్నవించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమావేశంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని గిరిజన గ్రామాలకు పీఎంజీఎస్‌వై పథకం విస్తరణ అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


