ఉట్నూర్‌రూరల్: భారీ వర్షాల ప్రభావిత గ్రామాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం సందర్శించి పరిస్థితి సమీక్షించారు. మండల కేంద్రంలోని నర్సాపూర్ (జె), నాగపూర్ బ్రిడ్జి, ఉట్నూర్ గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కల్వర్టులు, వంతెనలపై ప్రవహిస్తున్న వరద నీటి పరిస్థితిని పరిశీలించి, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరా యం కలగకుండా తగిన భద్రత చర్యలు చేపట్టాల ని, ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజ లను అనుమతించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వేగంగా సహాయక చర్యలు చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. అవసరం లేకుండా వరద ప్రవాహాలు, కల్వర్టులు, వాగులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని వివరించారు. ఆర్డీవో మోహన్, సీఐ ప్రసాద్, తహసీల్దార్ రఘునాథ్, ప్రజాప్రతినిధులున్నారు.


