కై లాస్‌నగర్: మాజీ మంత్రి జోగు రామన్న మానసిక స్థితి సరిగా లేకనే సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు వి మర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతి నిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయ న మాట్లాడారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రూ.2278.14 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన ఓర్వలేకపోతున్నార ని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరేసుకుంటానని సీఎంపై రామన్న చేసిన విమర్శలతో కూడిన వీడి యో క్లిప్పింగ్‌ను ఆయన ప్రదర్శించారు. 2014 ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబా ద్ ఎయిర్‌పోర్ట్, భూముల సర్వే, లైనింగ్ పనులు జరిగాయని ప్రస్తుతం భూసేకరణకు తమ ప్రభుత్వమే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


