సాత్నాల: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన భూభారతి రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు అన్నారు. భోరజ్ మండలంలోని తర్ణం గ్రామంలో మీర్జాపూర్,అవల్పూర్, కామ యి రైతులకు అవగాహన కల్పించేందు కు బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూముల హ ద్దులు, విస్తీర్ణం, రికార్డులు కచ్చితంగా నమోదు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో రైతులు తప్పని సరిగా పాల్గొని తమ భూముల హ ద్దులను పరిశీలించుకోవాలని, అభ్యంతరాలు, సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి, ఏడి ప్ర భాకర్, తహసీల్దార్ రాథోడ్ బాబుసింగ్, స ర్పంచ్ అరవింద్, ఆర్‌ఐ విలాస్, సర్వేయర్ మోహనకృష్ణ,జీపీవోలు,రైతులు పాల్గొన్నారు.
నిరాలలో..
జైనథ్: భూభారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని నిరాల రైతు వేదికలో నిరాల, ముక్తాపూర్, అడ, నిజాంపూర్ రైతులతో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. భూ రీసర్వే పై అవగాహన కల్పించారు. తహసీల్దార్ నారా యణ, సర్వేయర్ సుదర్శన్ పాల్గొన్నారు.


