‘అటెండెన్స్‌’పై కొరడా | - | Sakshi
Sakshi News home page

‘అటెండెన్స్‌’పై కొరడా

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

విద్యార్థుల హాజరు తగ్గడంపై చర్యలు 9మంది ఎంఈవోలకు మెమోలు ఆరుగురు కేజీబీవీ ఎస్‌వోలకు సైతం.. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవంటున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల హాజరు తగ్గితే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ యాజ మా న్య పాఠశాలలు, కేజీబీవీల్లో 70 శాతం హాజరు తగ్గి న మండలాల ఎంఈవోలకు మంగళవారం మెమో లు జారీ చేశారు.

తొమ్మిది మంది ఎంఈవోలకు..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం తగ్గి న తొమ్మిది మండలాల ఎంఈవోలకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఈవో డి.మాధవి మంగళవారం రాత్రి మెమోలు జారీ చేశారు. సిరికొండలో 69.1 శాతం, గుడిహత్నూర్‌లో 68.62, నేరడిగొండలో 68.23, భీంపూర్‌లో 67.85, ఆదిలాబాద్‌అర్బన్‌లో 67.32, సాత్నాలలో 66.67, నార్నూర్‌లో 65.90, మావలలో 65.48, ఇచ్చోడలో 63.8 శాతం హాజరు నమోదైంది. అలాగే కేజీబీవీలు బజార్‌హత్నూర్‌లో 68.79 శాతం, తోషంలో 67.50, ఇంద్రవెల్లిలో 65.26, బేలలో 60.30, నేరడిగొండలో 59.79, భీంపూర్‌లో 38.61 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. ఈ హాజరును ఉదయం 10.45 గంటల వరకు పరిగణలోకి తీసుకున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా హాజ రు ను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. వారిపై కూడా చర్యలుంటాయిని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. యాప్‌ సక్రమంగా పనిచేయడం లేదని, మ ధ్యాహ్నం వరకు పిల్లలు వస్తున్నారని, పనుల్లో ఉండి ఉపాధ్యాయులు మర్చిపోతున్నారని, మారుమూ ల మండలాల్లో నెట్‌వర్క్‌ సమస్య ఉందని చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధి కంగా ఉండడంతో సమయానికి హాజరు వేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ప్రతిరోజు పర్యవేక్షణ..

పాఠశాలల విద్యార్థుల హాజరును జిల్లా విద్యా శా ఖాధికారులు ప్రతిరోజు పరిశీలించనున్నారు. హాజ రు శాతం తక్కువగా ఉన్న ఎంఈవోలతో పాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ చేయనున్నారు.అలాగేఉపాధ్యాయు ల హాజరునూ పరిశీలించనున్నారు. దీంతో విద్యార్థుల హాజరుతో పాటు ఉపాధ్యాయులు సమయపాలన పాటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement