జిల్లా కేంద్రంలో 12 షాపుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు నోటీసులు ఇస్తామని చెబుతున్న అధికారులు షరా ‘మామూలు’గా మారిన మెడికల్ దందా
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని పలు మెడికల్ షాపుల యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ని బంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల కెమికల్‌డ్రగ్స్ అక్రమ విక్రయాలకు పాల్ప డుతున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి బండారం బయట పెట్టారు. దీంతో ఔషధ నియంత్రణ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు చేపట్టారు. కొందరు నిబంధనలు పాటించడం లేదని ఇందులో వెల్లడైంది. 12 షాపులకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత తెలిపారు.
నిబంధనలు తుంగలో..
పలు మెడికల్ షాపులు, ఏజెన్సీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. కొన్ని ఏజెన్సీలు ఆర్‌ఎంపీలకు మందులతో పాటు నిషేధిత మెసెంటా మైన్ సల్ఫేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. టూటౌన్ పోలీసులు ఇటీవల తనిఖీలు నిర్వహించగా, బస్టాండ్ ప్రాంతంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద ఈ ఇంజెక్షన్ లభించింది. దీంతో ఏజెన్సీని త నిఖీ చేయగా 50 ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. వాటి ని పోలీసులు స్వాధీనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంజెక్షన్లను సర్జరీల్లో వాడుతుండగా ఈ అక్రమార్కులు కొందరికి మత్తు ఎక్కేందుకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మెడికల్ షాపుల్లో సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి. కానీ వారికి బదులుగా ఇంటర్, టెన్త్ ఫెయిల్ అయిన వారిని అక్కడ నియమించుకొని ఈ దందా సాగిస్తున్నారు. ఏ మందులు విక్రయించారనే రికా ర్డులు అందుబాటులో ఉంచాల్సి ఉండగా, అవేమి పాటించడం లేదు. బి–ఫార్మసి చేసిన వ్యక్తుల సర్టిఫి కెట్లు షాపులో పెట్టుకొని వారికి నెలనెలా కొంత డబ్బు చెల్లించి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీ ల్లో తేలింది. ఇటీవల పలు షాపుల్లో కాలం చెల్లిన మందులు విక్రయించిన విషయం విధితమే.
నోటీసులతోనే సరి..
జిల్లాలో ఇదివరకు జరిగిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన షాపుల యజమానుల కు అధికారులు నోటీసులతోనే సరిపెట్టారు. రెండు మూడు రోజులు, వారం పాటు మూసివేసిన తర్వా త మళ్లీ షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. జరిమానా విధించకపోవడం, షాపులు సీజ్ చేయ డం వంటివి చేపట్టకపోవడంతో వారు ఆడిందే ఆట గా సాగుతోంది. తమ చేతుల్లో లేదని అధికారులు చేతులెత్తేసిన ఘటనలూ లేకపోలేదు. వారంపాటు మూసి ఉంచిన వారికి ఎలాంటి నష్టం లేకపోగా, మళ్లీ యఽథేచ్ఛగా అదే పనులను కానిచ్చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. కాగా, బుధవారం నిజామాబాద్ రూరల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, నిజామాబాద్ అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీకాంత్, నిర్మల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌సుందర్, ఆదిలాబాద్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీ లత పట్ట ణంలోని పలు షాపుల్లో తనిఖీలు చేపట్టా రు. ఉన్నతాధికారులకు నివేదికలు వారి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


