‘సీసీఐ’ పునఃప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

‘సీసీఐ’ పునఃప్రారంభించాలి

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

ఆదిలాబాద్‌టౌన్‌: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి జోగు రామన్న బుధవారం ఢిల్లీలో కలిశారు. ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్‌ ఫ్యాక్టరీ(సీసీఐ)ని ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర, జాన్సన్‌ నాయక్‌, సీసీఐ సాధన క మిటీ కన్వీనర్‌ దర్శనాల మల్లేశ్‌, కోకన్వీనర్‌ నారా యణ, అరవింద్‌, అరుణ్‌ కుమార్‌, జగన్‌ సింగ్‌, పోశెట్టి, దేవిదాస్‌, ఈశ్వర్‌దాస్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement