ఆరోగ్యకర జీవనశైలి అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకర జీవనశైలి అవసరం

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

బోథ్‌: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఆరో గ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. సొనాలలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం నిర్వహించిన ఆరోగ్య పాఠశా ల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థుల కు సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం రాగి జావ వంటి పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆవరణలో గ్రంథాలయం, న్యూట్రిగార్డెన్‌ ప్రారంభించారు. పా ఠశాల కంప్లైంట్‌ బాక్స్‌లో వచ్చిన ఫిర్యాదులను ప రిశీలించి చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలో ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన కలెక్టర్‌, ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తున్న పంచాయతీ సిబ్బందిని అభినందించారు. అనంతరం పీహెచ్‌సీ ని తనిఖీ చేశారు. ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేసి యాప్‌ పనితీరును పరిశీలించా రు. మండలంలో ’తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’ ఏర్పా టు చేయాలని కోరుతూ స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.పార్డి (బి) గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ బా లుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డీఈవో మాధవి, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ మల్లేశ్‌, ఎంపీడీవో రత్నాకర్‌ రావు, ఎంఈవో హుస్సేన్‌, సర్పంచ్‌ బిందుజ, ప్రధానోపాధ్యాయులు సచిన్‌, వీడీసీ చైర్మన్‌ తుల శ్రీనివాస్‌ ఉన్నారు.

‘సర్‌’.. గడువులోపు పూర్తి చేయాలి

కై లాస్‌నగర్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గూగుల్‌ మీట్‌ ద్వారా బుధవారం నిర్వహించిన సమీక్షలో ఎస్‌ఐఆర్‌ పురో గతి, ఎదురవుతున్న సమస్యలు, లక్ష్యాల సాధనపై అధికారులతో చర్చించారు. 50శాతం కంటే తక్కువ ఎన్యూమరేషన్‌ పూర్తి చేసిన అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో పనులు మందగించడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నా రు. లక్ష్య సాధనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించి నా సహించబోమని స్పష్టం చేశారు. అనంతరం వి విధ దశల్లో ఉన్న దరఖాస్తులు, నమోదు వివరాలు, డిజిటలైజేషన్‌, నివేదికల స్థితిగతులను శాఖల వారీగా సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement