ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష వి ద్యార్థి సంఘాల పిలుపు మేరకు శుక్రవారం ని ర్వహించిన విద్యాసంస్థల బంద్ జిల్లాలో వి జ యవంతమైంది. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఆ దివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్ చే పట్టగా, ఆయా విద్యాసంస్థల్లో తరగతులు నిలి చిపోయాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోనూ నాయకులు పాఠశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలోని 27వేల సర్కారు పా ఠశాలలను 4వేలకు పరిమితం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకో వాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించడంతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూని ఫాం వెంటనే అందించాలని కోరారు. కార్యక్రమంలో టీఏవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచి న్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడం కేశవ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు ఇషాంత్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మడావి గణేశ్, నాయకులు సాయి, అశోక్, ఆత్రం కిష్టన్న, కొ ట్నాక్ సక్కు, కుముర భీంరావు, పెందూర్ గోవింద్, రామన్న, మారుతి పాల్గొన్నారు.
శాంతియుత నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామికం
ఆదిలాబాద్‌టౌన్: విద్యాసంస్థల బంద్‌లో భాగంగా శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వెళ్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల నా యకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు అజ్మీరా వినోద్ పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


