దరఖాస్తులు
ఇచ్చోడ: భూభారతి సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పది రోజులుగా జిల్లావ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. జూన్ 28 నుంచి ప్రక్రియకు బ్రేక్ పడడంతో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీరో జు కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 522పెండింగ్
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 522 వరకు పెండింగ్ ఉన్నాయి. సర్వర్ సమస్య కారణంగా కంప్యూటర్లు పని చేయడంలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆపరేటర్లు రైతులకు సమాధా నం చెప్పలేక సతమతమవుతున్నారు. అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతుండడం గమనార్హం.
పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులు
మండలం పెండింగ్
ఇచ్చోడ 10
బజార్‌హత్నూర్ 16
తలమడుగు 33
ఇంద్రవెల్లి 25
భోరజ్ 10
తాంసి 10
భీంపూర్ 40
జైనథ్ 7
నేరడిగొండ 14
గుడిహత్నూర్ 3
సాత్నాల 4
ఆదిలాబాద్‌రూరల్ 20
బేల 10
నార్నూర్ 56
ఉట్నూర్‌రూరల్ 40
గాదిగూడ 224
సమస్య ఉంది..
పది రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్య కొనసాగుతుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్న ఓపెన్ కావడం లేదు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది.– జగదీష్, ఆర్డీవో


