ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ భూముల ఆక్రమణలను సహించబోమని, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సంబంధించిన భూకబ్జా ఆరోపణలపై బీజేపీ నాయకుడు ఎన్రాల నగేష్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మంగేష్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని 72/3 సర్వే నంబర్‌కు చెందిన భూమి ప్రభుత్వ భూమిగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై త్వరలోనే కలెక్టర్, ఎస్పీలకు మరోసారి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చట్టబద్ధంగా సంపాదించిన ఆస్తిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలను మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇందులో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖీజర్ పాషా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సంజయ్, కౌన్సిలర్ మహబూబ్, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శాంతన్‌రావు, ఎంఏ షకీల్, నిమ్మల గౌతమ్‌రెడ్డి, పోతారెడ్డి, మల్లయ్య, ప్రభాకర్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


