తలమడుగు: విద్యతోనే పిల్లలకు బంగారు భవిష్య త్తు లభిస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తలమడుగు మండలం డోర్లి గ్రామంలో నూతనంగా ని ర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విబిజి రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. గతంతో పో ల్చితే పాఠశాలలో సౌకర్యాలు మెరుగయ్యాయని, తల్లిదండ్రులు ప్రతి చిన్నారిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఇందులో డీఈవో మాధవి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీవో శంకర్, సర్పంచ్ పూజ, ప్రధానో పాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మూతపడిన పాఠశాలలకు జీవం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మూతపడిన పాఠశాలల కు మళ్లీ జీవం పోస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీ స్టేషన్‌రోడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, డీఈవో మాధవితో కలిసి శుక్రవారం పునఃప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు జిల్లాలో మూతపడిన 13 ప్రభుత్వ పాఠశాలలను తాజాగా తిరిగి ప్రారంభించామని అన్నారు. వాటిలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ మహ్మద్ రోహిత్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రామారావు రాథోడ్, ఏడీ గోపీకృష్ణ, ఎంఈఓ సోమయ్య, డాక్టర్ దేవిదాస్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.


