తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు

Jul 11 2026 3:40 AM | Updated on Jul 11 2026 3:40 AM

● ‘అరైవ్‌.. అలైవ్‌’తో జిల్లాలో 25 శాతం తగ్గుదల ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ‘అరైవ్‌.. అలైవ్‌’ కార్యక్రమం అమలుతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. గతేడాది తొలి ఆరునె లలతో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్యతోపాటు మరణాలు, క్షతగాత్రుల సంఖ్యగణనీ యంగా తగ్గినట్లు పేర్కొన్నారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 2025 తొలి ఆరునెలల్లో జిల్లాలో 217 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 86 మంది మృతి చెందారు. 260 మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 209 ప్రమాదాలు నమోదు కాగా 65 మంది మృతిచెందారు. 216 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ప్రమాద మరణాలు సుమారు 25 శాతం మేర తగ్గడం జిల్లా పోలీసుశాఖ చేపట్టిన సమష్టి కృషికి నిదర్శనమని తెలిపారు.

నాలుగో స్థానంలో జిల్లా..

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల తగ్గింపులో సైబ రాబాద్‌, సంగారెడ్డి, జోగులాంబ జిల్లాల తర్వాత ఆ దిలాబాద్‌ నాలుగోస్థానంలో నిలవడం గర్వకారణ మని ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యత

మహిళల భద్రతే పోలీసుల తొలి ప్రాధాన్యత అని ఎస్పీ అన్నారు. పట్టణంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌ ను శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ కె.ఫణిదర్‌, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక తని ఖీ లు చేపడుతున్నట్లు ఎస్పీ అన్నారు.శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. 20 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పట్ట ణంలో పలుచోట్ల తనిఖీలను ఎస్పీ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement