మహిళా సాధికారతే లక్ష్యం
కై లాస్‌నగర్: మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కై లాస్‌నగర్‌లో రూ.25లక్షల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని ప్రారంభించారు. అలాగే నాలుగో వార్డు అనుకుంటలో నిర్మాణం పూర్తయిన బాస గంగమ్మ–రమేశ్ దంపతుల ఇందిరమ్మ గృహా ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన కార్మక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జుతో కలిసి ఎస్‌హెచ్‌జీ సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు రూ.21.83 కోట్ల చెక్కును సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతీ ఎస్‌హెచ్‌జీ మహిళను కోటీశ్వరురాలిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికస్థిరత్వం సాధించాలచ్చారు. అప్పులు, ఆడంబరాలకు దూరంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతీ పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు సైతం వేగవంతం చేస్తున్న ట్లు తెలిపారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలు మె రుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్నారు.
బోథ్: నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాల కు చీరలు,అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధి దారులకు చెక్కులను ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి మంత్రి జూపల్లి అందజేశారు. ఈ సందర్భంగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని, మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డీఎస్పీ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు.


