బడిబయట పిల్లలెందరో..
జిల్లాలో కొనసాగుతున్న సర్వే ఈనెల 30 వరకు నిర్వహణ చెత్త కుప్పలు, పంట చేల్లలోనే అధికం బడిలో చేర్పించినా కొంతకాలానికి మళ్లీ అవే పనుల్లోకి..
ఆదిలాబాద్‌టౌన్: బాల్యం బంధీ అవుతోంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చేతులు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూదర్శనమిస్తున్నాయి. మరికొందరు పంట పొలాలు, ఇటుక బట్టీల్లో మగ్గిపోతున్నా రు. ఇంకొందరు భిక్షాటకులుగా, పశువుల కాపారి గా మారడంతో వారి భవిష్యత్తు అంధకారంగా మా రుతోంది. అధికారులు ఏటా బడిబయట పిల్లల స ర్వే చేసి వారిని గుర్తించి బడిలో చేర్పిస్తున్నా మళ్లీ ఆ రు నెలలకే వారు పనుల్లోనే కొనసాగుతుండడం గ మనార్హం. ఏటా మాదిరిగా విద్యాశాఖ ఈ సారి కూ డా బడిబయట పిల్లల సర్వేకు ఈ నెల20న శ్రీకారం చుట్టింది. నెలాఖరు వరకు కొనసాగనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 427 మంది పిల్లలను బడి బయట ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్‌అర్బన్‌లో 58 మంది, భీంపూర్‌లో 44, బోథ్‌లో 45, నేరడిగొండలో 36, ఉట్నూర్‌లో 53 మంది పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే సిరికొండ మండంలో 8 మంది, మావలలో ముగ్గురు, బేల మండలంలో ఒక్కరు కూడా నమోదు కాలేదని ఈ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సర్వే తీరుపై విమర్శలు..
జిల్లాలో బడిబయట పిల్లలను గుర్తించేందుకు ఏటా నవంబర్, డిసెంబర్‌లో సర్వే చేపడుతున్నారు. గతేడాది సమ్మె కారణంగా అలస్యమైంది. దానిని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించారు. ప్రస్తుతం బడీ డు పిల్లలను గుర్తించేందుకు సీఆర్పీలు, వైకల్యం గల పిల్లలను గుర్తించేందుకు ఐఈఆర్పీలు సర్వే చేపడుతున్నారు. అయితే ఒక్కో సీఆర్పీకి 18నుంచి 20 వరకు హాబిటేషన్లు ఉన్నాయి. వీటిని పది రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉండడం ఇబ్బందికరమే. ఈ క్రమంలో నామ్‌కే వాస్తే సర్వే చేపట్టి లెక్కలు చూపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
లక్ష్యం నెరవేరేనా..
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14ఏళ్లలోపు పిల్లలు బడిబయట ఉండకూడదు. నిర్బంధ విద్యను అమలు చేయాలి. అయితే ఈ లక్ష్యం నెరవేరడం లేదు. ఏటా బడిబయట పిల్లల్ని బడిలో చే ర్పించిన అధికారులు ఆ తర్వాత వారు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. కొన్ని పాఠశాాలల్లో విద్యార్థులు బడికి రాకపోయినా హాజరు పట్టికలో వారి పేర్లు అలాగే ఉంటున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేస్తారనే ఉద్దేశంతో ఖాకీ లెక్కలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బడిబయట గుర్తించిన పిల్లల్ని పూర్తిస్థాయిలో బడిలో చేర్పిస్తే వారు అక్షరాలు రాయడం, చదవడం సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నాం..
జిల్లాలో బడి బయట పిల్లల సర్వే కొనసాగుతుంది. 59 మంది సీఆర్పీలు, 22 మంది ఐఈఆర్పీలు ఈనెల 30 వరకు చేపట్టనున్నారు. వివరాలను ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. 30 రోజులు గైర్హాజరైన పిల్లలను డ్రాపౌట్‌గా గుర్తిస్తున్నాం. బడిబయట వారిని గుర్తించి బడిలో చేర్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. వారి వయస్సును బట్టి కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియళ్లలోని తరగతుల్లో చేర్పిస్తున్నాం.
– అజయ్, సెక్టోరియల్ అధికారి


