పర్యావరణ పరిరక్షణకు కృషి
నెల్లూరు (టౌన్): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్కూల్ హెచ్‌ఎం కృష్ణారెడ్డి తెలిపారు. పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలుర హైస్కూల్‌లో 10 ఆంధ్రా నావెల్ యూనిట్ 78వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి ధనుంజయరావు, ఎంఈఓ మురళీధర్‌రావు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, అంకయ్యచౌదరి, జనార్ధనరాజు పాల్గొన్నారు.


