అలరించిన గాన నీరాజనం
నెల్లూరు(బృందావనం): పురమందిరం ప్రాంగణంలోని వర్ధమాన సమాజం హాల్లో శాంతి కల్చరల్స్ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కృష్ణ తృతీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ‘నటశిఖరానికి గాన నీరాజనం’ అలరించింది. ఈ సందర్భంగా సినీనటుడు, ఆయుర్వేద వైద్యుడు కూరపాటి శ్యామ్‌ధన్‌ను సన్మానించారు. కృష్ణఅభిమాన సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు డి.రఘు, ఎ.వెంకు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ భాస్కర్‌రెడ్డి, సురేంద్ర, ఫయాజ్, సీనియర్ గాయకులు లక్ష్మి, ముత్తహర్‌బేగం, షఫీ, ప్రవీణ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


