విద్యార్థులకు చెకుముకి పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు చెకుముకి పోటీలు

Nov 24 2025 7:50 AM | Updated on Nov 24 2025 7:50 AM

విద్య

విద్యార్థులకు చెకుముకి పోటీలు

నెల్లూరు (టౌన్‌): స్థానిక సీబీఎస్సీ శ్రీచైతన్య స్కూల్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ విభాగంలో కేఎన్నార్‌ పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగంలో కోవూరుకు చెందిన రత్నం విద్యార్థులు విజేతలుగా నిలిచారు. అనంతరం వారికి సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం, పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. రామచంద్రారెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.రాజేశ్వరరావు, జేవీవీ నాయకులు శ్రీనునాయక్‌, చలపతి, విజయ్‌కుమార్‌, బుజ్జయ్య, కామయ్య, చలపతిశర్మ, కృష్ణ, మాదాల రాము, కృష్ణారావు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

మర్యాదపూర్వకంగా..

నెల్లూరు సిటీ: చింతారెడ్డిపాళెంలోని వైఎస్సార్‌సీపీ రూరల్‌ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు.

వేణుగోపాల్‌కు పురస్కారం

నెల్లూరు(అర్బన్‌): పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్‌ ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్నారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం కవులు, కళాకారులు, సమాజ సేవకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ క్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ ట్రిపుల్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గ్రహీత గజల్‌ శ్రీనివాస్‌ చేతుల మీదుగా వేణుగోపాల్‌ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు.

గోల్డ్‌ ఫీల్డ్‌ కాంక్రీట్‌

సొల్యూషన్స్‌ ప్రారంభం

నెల్లూరు(టౌన్‌): స్థానిక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఆదివారం గోల్డ్‌ ఫీల్డ్స్‌ కాంక్రీట్‌ సొల్యూషన్స్‌ను అజాక్స్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భట్టాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేగవంతమైన సర్వీసుతోపాటు విస్తృత శ్రేణిలో స్పేర్‌ పార్ట్స్‌ కలిగి ఉన్నట్లు చెప్పారు. గోల్డ్‌ ఫీల్డ్స్‌ అధినేతలు కార్తీక్‌, హరీష్‌లు మాట్లాడుతూ 55 ఏళ్ల నాటి గ్రూపులో భాగమైన గోల్డ్‌ ఫీల్డ్స్‌ కాంక్రీట్‌ డీలర్‌షిప్‌ను నెల్లూరుతో పాటు కడప, అనంతపురంలో ప్రారంభిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అజాక్స్‌ కంపెనీ ప్రతినిధులు విక్రమ్‌సింగ్‌, వీఎస్సార్‌ ప్రసాద్‌, వెంకటేష్‌, సాంబశివరాజు, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.

నేత్రదానం

నెల్లూరు(అర్బన్‌): వెంకటాచలం చర్చివీధికి చెందిన ఆలూరు మోహన్‌(56) ఆదివారం నగరంలోని సర్వజన ఆస్పత్రి(పెద్దాస్పత్రి)లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన భార్య మేరీ సుశీల, కుమారుడు కిరణ్‌లు ఆలూరు మోహన్‌ నేత్రాలను పెద్దాస్పత్రికి దానం చేశారు. దీంతో కార్నియా రికవరీ స్పెషలిస్టు సునీల్‌ మృతుని నేత్రాలను సేకరించి కుటుంబ సభ్యులకు నేత్రదాన సర్టిఫికెట్‌ను అందించారు. నేత్రదానం చేయదలచిన వారు 99595 89321 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు వెళ్లేందుకు టికెట్‌ కొని రైల్లో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి గత బుధవారం చిన్నగంజాం – వేటపాళెం రైల్వేస్టేషన్ల మధ్యలో పట్టాలపై పడి మృతిచెంది ఉన్నట్టు చీరాల రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. కుడి, ఎడమ ఛాతిపై నల్లటి పుట్టుమచ్చలు ఉన్నాయని, మెరూన్‌ కలర్‌ టీషర్ట్‌, నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు 94406 27646 ఫోన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

విద్యార్థులకు  చెకుముకి పోటీలు 1
1/5

విద్యార్థులకు చెకుముకి పోటీలు

విద్యార్థులకు  చెకుముకి పోటీలు 2
2/5

విద్యార్థులకు చెకుముకి పోటీలు

విద్యార్థులకు  చెకుముకి పోటీలు 3
3/5

విద్యార్థులకు చెకుముకి పోటీలు

విద్యార్థులకు  చెకుముకి పోటీలు 4
4/5

విద్యార్థులకు చెకుముకి పోటీలు

విద్యార్థులకు  చెకుముకి పోటీలు 5
5/5

విద్యార్థులకు చెకుముకి పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement