ఘనంగా సత్యసాయిబాబా జయంతి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సత్యసాయిబాబా శత జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ అజిత వేజెండ్ల ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, వెల్ఫేర్ ఆర్‌ఐ రాజారావు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
● నెల్లూరు(పొగతోట): సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఆదివారం జెడ్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి పూలమాల వేశారు.
● నెల్లూరు(బారకాసు): మినీబైపాస్‌రోడ్డు గోమతినగర్‌లోని సత్యసాయి మందిరం(సాయిహృదయ)లో ఆదివారం సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం మద్రాసు బస్టాండ్ సమీపంలో కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న సాయిబాబా మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం పద్మచక్రవర్తి తన బృందంతో వీణ కచేరి నిర్వహించారు. మందిర కన్వీనర్ కొండా శేషగిరిరావు, జిల్లా సేవాదళ్ ఇన్‌చార్జి నాగలక్ష్మి, యూత్ కో–ఆర్డినేటర్ రాజశేఖర్, బాలవికాస్ ఇన్‌చార్జి గాయత్రి, మహిళా సేవాదళ్ రాజి పాల్గొన్నారు.
● నెల్లూరు(బృందావనం): పుర మందిరంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మురళీమోహన్‌రాజు ఆధ్వర్యంలో ఆదివారం సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరై, సత్యసాయిబాబా సేవా నిరతిని కొనియాడారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రముఖులైన డాక్టర్ పావులూరు శ్రీనివాసులు, డాక్టర్ జీవీవీ ప్రసాద్‌రెడ్డి, కుండా భాస్కర్, నాగిరెడ్డి విజయనిర్మల, మీసాల వజ్రమ్మ, ఆసూరి రాఘవాచార్యులను సత్కరించారు. కందికట్టు రాజేశ్వరి, బయ్యా శ్రీనివాసులు, సీహెచ్ హరిగోపాల్, డాక్టర్ కె.పెంచలరెడ్డి, ఎస్వీ రమేష్‌బాబు, కొండూరు హరినారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా సత్యసాయిబాబా జయంతి


