ఆ | - | Sakshi
Sakshi News home page

Nov 26 2025 6:47 AM | Updated on Nov 26 2025 6:47 AM

ఆ

9లోu

తొలుత సర్పంచ్‌ ఎన్నికలపై గురి ఓడినా ‘పరిషత్‌’ ఉందనే ధీమా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి

చీర కావాలంటే.. ఫొటో దిగాల్సిందే
ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారు తప్పనిసరిగా ఫొటో దిగాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్షన్‌

శావహులకు

కై లాస్‌నగర్‌: సర్పంచ్‌ ఎన్నికలను తొలుత నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటి రిజర్వేషన్లు సైతం ఖరారు చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులకు సర్కారు నిర్ణయం మంచి ఆప్షన్‌లా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీ క్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఓటమి పాలైనా.. త్వరలోనే నిర్వహించనున్న పరిషత్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరఫున మరోమారు పోటీ చేయచ్చనే ఉద్దేశంతో పల్లెపోరుకు జై కొడుతున్నారు. షెడ్యూల్‌ సైతం ప్రకటించడంతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆశపడి.. నిరాశకు గురై

రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్‌ ఎన్నికలను మొదట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్‌ సైతం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించిన ఆశావహులు అందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాన పార్టీల తరఫున టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపును కోర్టు సమర్థించకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. దీంతో వారు నిరాశ చెందారు. తాజాగా పరిషత్‌కు బదులు తొలుత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్‌లు, వార్డుమెంబర్ల రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఖరారు చేస్తు గెజిట్‌ కూడా ప్రకటించింది.

బీసీల్లో ఆవేదన..

అక్టోబర్‌లో 42శాతం రిజర్వేషన్లను ప్రకటించడంతో బీసీ స్థానాలు భారీగా పెరిగాయి. రిజర్వేషన్‌ కలిసిరావడంతో ఆయా కులస్తులు పోటీకి సిద్ధమయ్యారు. తాజాగా ఆ స్థానాలు తగ్గించి ఖరారు చేయడంతో ఆయా కులాలకు సంబంధించి ఆశావహుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి వరకు పోటీకి ఉత్సాహం చూపిన వారి అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. కొత్త రిజర్వేషన్లతో పోటీకి అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచ్‌గా ఓడినా.. పరిషత్‌పై ధీమా

గ్రామ ప్రఽథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల్లోని చోటామోటా నాయకులు ఆశపడుతుంటారు. పార్టీయేతర ఎన్నికలు అయినప్పటికీ పార్టీల మద్దతు ఉంటే గెలుపు సునాయాసమవుతుందని భావిస్తుంటారు. పరిషత్‌ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండటంతో ఆ ఎన్నికల్లో పార్టీల గుర్తుపై పోటీ చేసి ఓడిపోతే సర్పంచ్‌గా మళ్లీ అవకాశం దక్కే పరిస్థితి ఉండదు. దీంతో పంచాయతీ పోరు అలాంటి అభ్యర్థులకు మంచి ఆప్షన్‌లా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గెలిస్తే సర్పంచ్‌గా గ్రామంలో పెత్తనం చేసే అవకాశం లభిస్తోంది. ఒకవేళ ఓడిపోతే పరిషత్‌ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవచ్చని భావిస్తున్నారు.

మొదలైన సందడి..

పంచాయతీ పోరుకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లు.. ఎవరు పోటీ చేస్తున్నారు.. వంటి అంశాలపైనే చర్చ సాగుతోంది. ఆయా పార్టీ లనుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులుంటే సర్పంచ్‌గా ఎవరు పోటీ చేయాలి, ఎంపీటీసీగా ఎవరు బరిలో నిలువాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. కొంతమంది రెండింటిలోనూ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. అలాంటి వారు గెలుపుకోసం ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. నిన్నటి వరకు చూసిచూడనట్లుగా వెళ్లే వారు ఆగి మరి పలకరించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. శుభకార్యాలయాలు ఉందని తెలిస్తే చాలు వారి ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లకు పిలవకుండానే హాజరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement