మహిళలు వ్యాపారం వైపు మొగ్గు చూపాలి
ఆదిలాబాద్‌రూరల్: వడ్డీలేని రుణాలతో మహిళలు వ్యాపారం వైపు దృష్టి సారించాలని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు మంగళవారం రూ.3కోట్లకు పైబడి వడ్డీ లేని రుణాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయన్నారు. రుణాలు తీసుకున్న ఆయా సంఘాలు వ్యాపారం వైపు దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఎంపీడీవో వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


