మున్సిపల్ ఆర్‌డీ రహస్య పర్యటన
కైలాస్‌నగర్: మున్సిపల్ శాఖ హైదరాబాద్ జోన్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో రహస్యంగా పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్–2 కింద చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణాల ప్రగతి పరిశీలన కోసం ఆయనను మున్సిపల్ ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం జిల్లాకు నియమించింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పలు ప్రాంతాల్లో గుట్టుగా పర్యటించారు. పట్టణంలో చేపట్టిన ట్యాంకుల నిర్మాణాల ప్రగతి నత్తనడకన సాగుతుంది. కనీసం బెస్‌మెంట్ స్థాయికి కూడా అవి చేరని పరిస్థితి. అలాగే బల్దియా డంపింగ్‌యార్డ్ నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా మారింది. గత జూన్ నుంచి బయో మైనింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. బల్ది యా, పబ్లిక్ హెల్త్ అధికారుల వైఫల్యం బయటపడే అవకాశముందనే ఉద్దేశంతో ఆర్‌డీ వచ్చిన విషయాన్ని బల్దియా అధికారులు బయటకు రాకుండా జా గ్రత్తపడినట్లుగా తెలుస్తోంది. కాగా ఆర్‌డీ ట్యాంకు ల నిర్మాణాలతో పాటు డంపింగ్‌యార్డును పరిశీ లించారు. వాటి ప్రగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ము న్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఆయా పనుల వివరాలపై ఆరా తీశారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఈఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులున్నారు.


