క్రమశిక్షణ పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీసులు విధుల్లో చురుకుదనం, నిజాయతీ, క్రమశిక్షణ పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశా రు. కార్యాలయంలోని రికార్డులు, పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా భద్రతలో నేర నియంత్రణ ముఖ్యమైనదని అన్నారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంకెన్ డ్రైవ్, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాయితీ బియ్యం తరలించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునిల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, రమ్య, ఇసాఖ్ అలీ, హరుణ్ అలీ తదితరులున్నారు.


