ప్రైవేటీకరణను నిలిపేవరకు పోరాటం ఆగదు
● వైఎస్సార్‌సీపీ రూరల్ సమన్వయకర్త
ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు సిటీ: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని ఆపే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ తీరును ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో 34వ డివిజన్ ఇన్‌చార్జి ఇలియాజ్, 34వ డివిజన్ నాయకులు రఫీ, నిసర్, విజయ్, రాజారత్నం, రాజమ్మ, నాగేశ్వరి, మస్తాన్, రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ పత్రాల అందజేత
36వ డివిజన్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డికి ఆదివారం డివిజన్ ఇన్‌చార్జి బాబీ భగత్ అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. కార్యక్రమంంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రఫీ, అనిల్, ఖాజా, ముంతాజ్, అజయ్ పాల్గొన్నారు.
ప్రైవేటీకరణను నిలిపేవరకు పోరాటం ఆగదు


