భౌ..బోయ్‌! | - | Sakshi
Sakshi News home page

భౌ..బోయ్‌!

Nov 25 2025 9:13 AM | Updated on Nov 25 2025 9:13 AM

భౌ..బోయ్‌!

భౌ..బోయ్‌!

● బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు ● వీధి కుక్కల దాడులతో జనం ఇక్కట్లు ● పలు పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని ‘ఏఆర్‌వీ’ ● ఆదిలాబాద్‌ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో వారం క్రితం పలువురు విద్యార్థినులను రాత్రి సమయంలో ఎలుకలు కరిచాయి. దీంతో ఉపాధ్యాయులు వా రిని స్థానిక శాంతినగర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఏఆర్‌వీ రెండు డోస్‌లు ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్‌ లేకపోవడంతో వారిని రిమ్స్‌కు పంపించారు. ● నేరడిగొండలోని పీహెచ్‌సీలో యాంటీ రెబిస్‌ వ్యాక్సిన్‌ లేదు. మూడు రోజుల నుంచి వ్యాక్సిన్‌ లేదని మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కుక్క కాటుకు గురైన వారు వస్తే బోథ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. ● ఇంద్రవెల్లిలో ఈ నెలలో ఇప్పటి వరకు 28 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పీహెచ్సీలో సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ● ఇచ్చోడ పీహెచ్‌సీలో ఇండెంట్‌కు సరిపడా వాక్సిన్‌ ఇవ్వడం లేదు. ఆదిలాబాద్‌ డ్రగ్‌ స్టోర్‌ వారు తక్కువగా ఇస్తున్నట్లుగా ఇక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. ● గుడిహత్నూర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. ఇండెంట్‌ పెట్టామని సిబ్బంది తెలిపారు. ● ఉట్నూర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. ఆస్పత్రికి వచ్చిన బాధితులను రిమ్స్‌కు పంపిస్తున్నారు. దీంతో స్థానికులకు రవాణా ఇక్కట్లు తప్పడం లేదు.

ఆదిలాబాద్‌టౌన్‌: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే గ్రామ సింహాలు ఇప్పుడు ప్రజలు, మూగజీవాల పాలిట మృత్యుపాశంగా మారుతున్నాయి. యథేచ్ఛగా దాడులకు పాల్పడుతూ జనాన్ని ఆస్పత్రి పా లు చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వీటి బెడద ఎక్కువైంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పిక్కలు పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మూగజీ వాలను సైతం వదలడం లేదు. ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలో ఇటీవల మేకలు, గొర్రెల మందపై శునకాలు దాడి చేయడంతో అవి మృతిచెందాయి. అలాగే జిల్లాకేంద్రంలో ఓ చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో స్థానికులు గమనించడంతో చిన్నారి ప్రాణాలతో బయట పడింది. అయితే కుక్కలు కరిచినప్పుడు ఇచ్చే యాంటీ రెబిస్‌ వ్యాక్సి న్‌ (ఏఆర్‌వీ) జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో అందుబాటులో లేదు. సోమవారం ‘సాక్షి’ జిల్లాలోని పలు ప్రాథమిక ఆస్పత్రులను విజిట్‌ చేసిన క్రమంలో ఈ విషయం తేటతెల్లమైంది.

కుక్కల స్వైర విహారం..

పల్లె పట్టణం తేడా లేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి అడుగు పెట్టేందుకు జనం జంకుతున్నారు. రాత్రి వేళల్లో వీటి దాడులు అధికమవుతున్నాయి. పనుల నిమి త్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై దాడి చేసి పిక్కలు పీకేస్తున్నాయి. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వీటి దాడిలో పలువురికి సంబంధించిన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన ఘటనలూ అనేకం చోటుచేసుకున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

కాగా, ఈ విషయమై డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ను వివరణ కోరగా.. వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, ఎక్కడైనా లేకపోతే డ్రగ్‌ స్టోరేజీ నుంచి తీసుకెళ్లాలని సిబ్బందికి సూచించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement