గోడు వినండి.. గోస తీర్చండి
కైలాస్‌నగర్: తమ సమస్యలు ఆలకించి వాటి పరి ష్కారానికి చొరవ చూపాలని బాధితులు వేడుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొని అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించా రు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, కలెక్టరేట్ ఏవో వర్ణ, సూపరింటెండెంట్ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే..


