కథల పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
జైనథ్: తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీల్లో మండలంలోని లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని హె డావ్ శ్రావణి రాసిన కథకు ప్రత్యేకు బహుమతి లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని తె లంగాణ సారస్వత పరిషత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రావణిని శాంతా బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మభూషణ్, డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, ప్రశంసాపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రావణిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమంతారావు, రహీం రాజేశ్వర్, నారాయణ, మహేశ్, ద్రౌపతీబాయి, విలాస్ తదితరులు అభినందించారు.


