కలెక్టర్‌కు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. వి ద్యారంగ అభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తి స్తూ ఆదివారం ఆయన కార్యాలయంలో శాలు వాతో సత్కరించి పూలమొక్క ఇచ్చారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనక అభిమాన్ విఠల్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌సింగ్, జిల్లా గౌరవాధ్యక్షుడు దాసరి బాబన్న, జిల్లా అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు ఆడే నూర్‌సింగ్, నర్ర నవీ న్‌యాదవ్, జిల్లా కోశాధికారి ముజీబ్, తాంసి మండలాధ్యక్షుడు రమేశ్, ఆదిలాబాద్ అర్బన్ సెక్రటరీ కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.


