సొంత తమ్ముళ్లే.. మూడుసార్లు 'కప్పు టీ' తో అన్నపై.. | - | Sakshi
Sakshi News home page

సొంత తమ్ముళ్లే.. మూడుసార్లు 'కప్పు టీ' తో అన్నపై..

Aug 12 2023 1:34 AM | Updated on Aug 12 2023 8:02 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: తమ చేనులో ఉన్న నిధి తవ్వకానికి అడ్డువస్తున్న తమ్ముళ్లు అన్నను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసి దొరికిపోయారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్‌ బిలాల్‌, షేక్‌ సులేమాన్‌, షేక్‌ ఆదాం ముగ్గురు అన్నదమ్ములు.

తమ చేనులో ఉన్న నిధి (బంగారం)ని తవ్వడానికి అన్న షేక్‌ ఆదాం ఒప్పుకోడని నిర్ధారించుకుని అతడిని అంతం చేయాలని షేక్‌ బిలాల్‌, షేక్‌ సులేమాన్‌ పథకం పన్నారు. గ్రామానికి చెందిన షేక్‌ అజ్గర్‌ను కలిసి షేక్‌ ఆదాంను మట్టుబెట్టడానికి గ్రామానికి చెందిన తాళ్ల రమేశ్‌తో బేరం కుదుర్చుకున్నారు. తాళ్ల రమేశ్‌ పథకం ప్రకారం షేక్‌ ఆదాంకు తన ఆవును విక్రయిస్తానని నమ్మించి ఈ నెల 5న ఇంటికి పిలిచాడు.

తనే స్వయంగా చాయ్‌లో మత్తు పదార్థాలు కలిపి షేక్‌ ఆదాంకు ఇవ్వగా అతడు దానిని తాగలేదు. మళ్లీ 8వ తేదీన ఆదాం తన టైలర్‌షాప్‌లో పని చేస్తుండగా రమేశ్‌ హోటల్‌ నుంచి చాయ్‌ తీసుకువచ్చి ఆదాంకు ఇచ్చాడు. అనుమానంతో ఆదాం చాయ్‌ తాగలేదు. అదేరోజు సాయంత్రం ఆదాం తన చేనులో పని చేస్తుండగా రమేశ్‌ చాయ్‌ తీసుకువెళ్లాడు. దీంతో అనుమానించిన ఆదాం రమేశ్‌ను బెదిరించాడు. దీంతో రమేశ్‌ అసలు విషయం చెప్పాడు. దీంతో ఆదాం పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement