గుడిహత్నూర్: మండలంలోని కొల్హారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా పాల్గొని కోవ చైతన్య–అశోక్ దంపతులు నూత న నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో సమావేశమై సర్ ప్రక్రియ తీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో ఇంతియాజ్, హౌసింగ్ డీఈ రమేశ్, ఏఈ గణేశ్, పంచాయతీ కార్యదర్శి జైపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.


