● మున్సిపల్‌ అధికారుల విస్తృత తనిఖీలు ● నిబంధనలు పాటించని యజమానులకు జరిమానా | - | Sakshi
Sakshi News home page

● మున్సిపల్‌ అధికారుల విస్తృత తనిఖీలు ● నిబంధనలు పాటించని యజమానులకు జరిమానా

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

● మున్సిపల్‌ అధికారుల విస్తృత తనిఖీలు ● నిబంధనలు పాటించని యజమానులకు జరిమానా

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నాసిరకం భోజనంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ స్పందించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు హోట ళ్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు, బేకరీలను తనిఖీ చేశా రు. నిబంధనలు పాటించని పలు దుకాణాల యజమానులకు జరిమానా విధించారు. అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా రు. ఈనెల 9న ‘ఛీ..ఛీ.. భోజనంలో పురుగులు, బల్లులు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అప్రమత్తమైన అధికారులు శనివారం పట్టణంలోని బాదామ్‌ జూస్‌బార్‌ 99 వైరెటీస్‌ దోశ హబ్‌ కు రూ. 20 వేల జరిమానా, న్యూ ఫ్యారడైస్‌ హో టల్‌కు రూ.3వేలు, స్ట్రెంజర్‌ పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు రూ. 2వేలు, అక్షయ పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు రూ. వెయ్యి, రాయల్‌ అరేబియన్‌ మండీకి రూ. 2వేల చొప్పున జరిమానా విధించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన ఆహార పదార్థాలను ఉపయోగించాలని సూచించారు.

హోటళ్లపై కొరడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement