నూతన ఆర్‌యూబీ మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నూతన ఆర్‌యూబీ మంజూరు చేయాలి

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

ఆదిలాబాద్‌: జిల్లా ప్రజల సౌకర్యార్థం నూతన రైల్వే అండర్‌ బ్రిడ్జి మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కోరారు. హైదరాబాదులో శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలి సి, పలు రైల్వే పనుల పురోగతి, అభ్యర్థనలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. భూసేకరణ పరిహారానికి సంబంధించి మిగిలి ఉన్న రూ.14.89 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా అదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తాటిగూడ వరకు పాదచారులు, ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు లేక రాకపోకలకు అణువుగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిమ్మ, భోరజ్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌ ప్రాంతాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం నూతన రైల్వే అండర్‌ బ్రిడ్జి మంజూరు చేయాలని విన్నవించారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement