ప్రధాని మోదీ నామినేషన్‌కు సీఎం నితీష్‌ గైర్హాజరు.. కారణమిదే! | Nitish Kumar will not Participate in the Nomination of Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ నామినేషన్‌కు సీఎం నితీష్‌ గైర్హాజరు.. కారణమిదే!

May 14 2024 10:11 AM | Updated on May 14 2024 11:22 AM

Nitish Kumar will not Participate in the Nomination of Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం)వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా  ఉంది. అయితే ప్రధాని మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

సీఎం నితీష్ కుమార్ అస్వస్థతకు గురయిన నేపధ్యంలో ఆయన నేడు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని సమాచారం. ఆయన ఎన్నికల ప్రచారానికి, బహిరంగ సభలకు కూడా హాజరుకారు. అయితే ఈరోజు సుశీల్ కుమార్ మోదీ నివాసానికి  వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన నితీష్ కుమార్‌కు సన్నిహితునిగా మెలిగారు.

ప్రధాని మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement