ఫిఫా ప్రపంచకప్‌లో (FIFA World Cup 2026) అనామక జట్టు కేప్ వెర్డె.. మాజీ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ స్పెయిన్‌ను నిలువరించి సంచలనం నమోదు చేసింది.
మ్యాచ్ డ్రా అయినప్పటికీ కేప్ వెర్డె ఖాతాలో ఇది విజయం కిందే లెక్క. మ్యాచ్‌లో నిజమైన హీరో మాత్రం 40 ఏళ్ల గోల్ కీపర్ వోజిన్హా. (Goalkeeper Vozinha)
మ్యాచ్ ఆద్యంతం స్పెయిన్ ఆటగాళ్లకు అడ్డుగోడలా నిలిచిన వోజిన్హా ఏడుసార్లు బంతి గోల్‌పోస్టు వెళ్లకుండా సమర్థంగా అడ్డుకున్నాడు.
ఈ దెబ్బతో అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలోవర్ల సంఖ్య 50 వేల నుంచి 5 మిలియన్లకు చేరుకోవడం విశేషం.


