breaking news
Vozinha
-
ఫిఫా ఫైనల్లో స్పెయిన్.. ఆ జట్టును మాత్రం ఓడించలేకపోయింది!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా తాను తలపడిన అన్ని జట్లను చిత్తు చేసిన స్పెయిన్ కేప్వెర్డెను మాత్రం ఓడించకలేకపోయింది. గ్రూప్ దశలో కేప్‌వెర్డెతో మ్యాచ్‌ను స్పెయిన్ 0-0తో డ్రా చేసుకోవడం గమనార్హం. దీంతో అనామక జట్టుగా ఫిఫాలో ఎంట్రీ ఇచ్చిన కేప్‌వెర్డె టోర్నీ నుంచి నిష్క్రమించే సమయంలో హీరోలా మారిపోయింది. తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో వోజిన్హా స్పెయిన్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్ ఆటగాళ్లు 27 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసినప్పటికీ వాటన్నింటిని సమర్థంగా అడ్డుకొని 40 ఏళ్ల వయసులో వోజిన్హా సూపర్‌హీరోగా నిలిచాడు.Photo Credit: FIFA Twitterతాజాగా సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ టీం ఒక కామెంట్ చేసింది. ‘ఈ ఫిఫాలో మేము అందరిని నిలువరిస్తే.. మమ్నల్ని మాత్రం కేప్‌వెర్డె నిలువరించింది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్ కంటే కేప్‌వెర్డెతో మ్యాచ్ మాకు చాలా కష్టమనిపించింది’ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. తాజాగా స్పెయిన్ టీం చేసిన వ్యాఖ్యలతో కేప్‌వెర్డె మరోసారి వార్తల్లో నిలిచింది.స్పెయిన్ ప్రయాణం సాగింది ఇలా..ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్-హెచ్లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను కేప్‌వెర్డెతో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాను 4-0తో చిత్తు చేసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేను 0-1తో ఓడించిన స్పెయిన్ టేబుల్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో ఆస్ట్రియాను 0-3తో ఓడించి స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు గోల్ చేయడంలో స్పెయిన్ విఫలమైంది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మైకెల్ మిరినో స్టాపేజీ టైం (91వ నిమిషం)లో గోల్ చేసి పోర్చుగల్‌కు పీడకలను మిగిల్చాడు. పోర్చుగల్‌పై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్ బెల్జియంతో తలపడింది. తొలి హాఫ్ ముగిసేసరికి 1-1తో సమంగా నిలిచాయి. అయితే రెండో హాఫ్‌లో బెల్జియం గోల్‌కీపర్ సన్నె లామిన్స్ చేసిన చిన్ప తప్పిదం బెల్జియం కొంపముంచింది. స్పెయిన్ ఆటగాడు కుబార్సి కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో లామిన్స్ మిస్ చేయడం, ఇదే అదనుగా భావించిన మికెల్ మెరినో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి మరోసారి హీరోగా నిలిచాడు. ఫలితంగా స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జరిగిదంతా ఒక చరిత్రే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. 🚨FACT: Cape Verde are the only team Spain faced at the 2026 World Cup that they DIDN’T beat pic.twitter.com/51p0mFj8ip— Polymarket Sports (@PolymarketSport) July 14, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
స్పెయిన్‌ను నిలువరించిన అడ్డుగోడ.. 40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు)
-
స్పెయిన్‌కు చుక్కలు చూపించిన గోల్‌కీపర్.. ఎవరీ వోజిన్హా?
స్టార్డమ్ అనేది ఉన్నపళంగా రాదు. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులోనూ అనామక జట్టు నుంచి వచ్చే ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు ఉండదు. ఏదైనా సంచలనాలు నమోదైనప్పుడే అవి వెలుగులోకి వస్తాయి. తాజాగా ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ను కేప్ వెర్డె డ్రా చేసుకున్నప్పటికీ సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఒక్కడు మాత్రం మ్యాచ్ ముగిసినా అదే పనిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తున్న వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే కేప్‌వెర్డె గోల్ కీపర్, 40 ఏళ్ల వోజిన్హా. వోజిన్హా లేకపోయుంటే మాత్రం ఇవాళ కేప్‌వెర్డె అనామక జట్టుగానే ఉండిపోయేది. 40 ఏళ్ల వయసు అంటే రిటైరయ్యే టైమ్.. కానీ వోజిన్హా మాత్రం 40 ఏళ్ల వయసులో తొలి ఫిఫా వరల్డ్‌కప్ ఆడుతున్నాడు. స్పెయిన్‌తో మ్యాచ్‌కు ముందు వోజిన్హా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 50వేలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5 మిలియన్లకు చేరడం విశేషం. ఈ నేపథ్యంలో వొజిన్హా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.ఫిఫా ప్రపంచకప్‌లో అనామక జట్టైన కేప్ వెర్డె మాజీ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ స్పెయిన్‌ను నిలువరించి పెద్ద సంచలనం నమోదు చేసింది. మ్యాచ్ డ్రా అయినప్పటికీ కేప్ వెర్డె ఖాతాలో ఇది విజయం కిందే లెక్క. మ్యాచ్ డ్రా అయినప్పటికీ నిజమైన హీరో మాత్రం 40 ఏళ్ల గోల్ కీపర్ వోజిన్హానే అని చెప్పొచ్చు. లామినే యమాల్, రోడ్రి,పెడ్రీ వంటి స్టార్ ఆటగాళ్లున్న స్పెయిన్ వంటి బలమైన జట్టును తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో నిలువరించి అడ్డుగోడలా నిలబడ్డాడు వోజిన్హా. ఏకంగా ఏడుసార్లు స్పెయిన్ ప్లేయర్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్ సంచలనం లామినె యామల్ 71వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆదీనంలో ఉంచుకున్నా కేప్ వెర్డె గోల్కీపర్ను బోల్తా కొట్టించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఫిఫా చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వోజిన్హాకే మ్యాచ్‌లో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మ్యాచ్ ముగిసిన అనంతరం కేప్ వెర్డె గోల్‌కీపర్ 40 ఏళ్ల వోజిన్హా ఎమోషనల్ అయ్యాడు. 'ఇవాళ నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న స్పెయిన్‌ను అడ్డుకోవడం కష్టమైనప్పటికీ నా శాయాశక్తులా కృషి చేశాను. అయితే దురదృష్టవశాత్తూ ఇవాళ నా ప్రదర్శన చూడడానికి మా అమ్మ నా దగ్గర లేదు. వీసా సమస్యల వల్ల ఆమె రాలేకపోయింది. ఇక గేమ్ ముగిసిన తర్వాత అంతలా ఏడ్వడానికి ఒక కారణముంది. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా మా గ్రాండ్పేరేంట్స్తోనే పెరిగాను. ఇవాళ నా ప్రదర్శన చూడడానికి వారిద్దరూ సజీవంగా లేరు. ఏడాది క్రితమే నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. కనీసం ఈ సమయంలో నా పక్కన మా అమ్మ ఉండుంటే బాగుండేది' అని చెప్పుకొచ్చాడు.ఎవరీ వోజిన్హా?25 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటను ఆడడం ప్రారంభించిన వోజిన్హా మాల్డోవా, సిప్రస్, స్లోవెకియా, పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2012లో కేప్ వెర్డె జాతీయ జట్టుకు ఎంపికైన వోజిన్హా ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు 15 ఏళ్లు పట్టింది. ఈ 15 ఏళ్లలో అతడు ఐదు మేజర్ టోర్నీలు ఆడాడు. ఆఫ్రికా కప్ నేషన్స్ టోర్నీలో పాల్గొన్నాడు.🇨🇻😢 Cape Verde goalkeeper Vozinha: "I cried after the game because I grew up with my grandparents when I was a kid, and they could not be there. They passed away a few years ago. My mum could not be here either for a VISA issue, and the money we had to pay for it. We did not… pic.twitter.com/vbMGHPCQez— EuroFoot (@eurofootcom) June 15, 2026 ❤️🇨🇻 Vozinha: “Unfortunately my mum could not be here either for a VISA issue, and the money we had to pay for it”.“We did not manage to do this in time”. pic.twitter.com/zkzDLlDt0l— Fabrizio Romano (@FabrizioRomano) June 15, 2026He said not today🔥🔥🔥what a save pic.twitter.com/cnu6xgpOCn— Luvuyo Afrika (@Teboho2731) June 15, 2026చదవండి: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా!


