
టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ వివాహ వార్షికోత్సవం నేడు(జూన్ 1)

ఈ సందర్భంగా ఈ చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తన భార్య జయా భరద్వాజ్‌ను ఉద్దేశించి భావోద్వేగపూరిత పోస్టుపెట్టాడు.

పెళ్లై రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. ‘‘ఇద్దరం కలిసి జీవితంలోని ఎత్తుపళ్లాలను చూస్తూ ఉన్నాం. రోజురోజుకీ మన బంధాన్ని మరింత పదిలం చేసుకుంటున్నాం.

ఇక ముందు కూడా ఇలాంటి భావోద్వేగ డోలికల్లో తేలియాడాలని.. సవాళ్లను ఇద్దరం కలిసి ఎదుర్కోవాలని ఆశిస్తున్నా’’ అని దీపక్ చహర్ భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

కాగా తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో దీపక్ 2022లో మనువాడాడు.

ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

దీపక్ చహర్ పేస్ ఐపీఎల్-2024లో ఆడాడు.

వరల్డ్‌కప్-2024 జట్టులో అతడికి చోటు దక్కకపోవడంతో ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు.








