తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధికార బాధ్యతలతో ఎడతెరిపి లేని పాలన షెడ్యూల్‌లో బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ పనులు, పరిపాలనా సమావేశాలతో తీరికలేని రోజులు గడుస్తున్నప్పటికీ, కాస్త విరామం దొరికినప్పుడు సినీ రంగ ప్రముఖులకు సమయం కేటాయిస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్, హీరో విశాల్, హీరోయిన్ సమంత, రాధికా శరత్‌కుమార్ దంపతులు, కుష్బూ సుందర్ దంపతులు, స్నేహా ప్రసన్న దంపతులు, శింబు వంటి ప్రముఖులు సీఎం విజయ్‌ను కలిశారు. వీరితో ఆయన ఆత్మీయంగా ముచ్చటించి ఫోటోలు దిగారు.


