హైదరాబాద్ : అందమైన గ్రానైట్ బొమ్మలు..అబ్బుర పరిచే ఇంటీరియర్ డిజైన్లు..వావ్ అనిపించే నిర్మాణరంగ థీమ్‌లతో ‘ఐఐఐడీ షోకేస్ ఇన్‌సైడర్ ఎక్స్’ ప్రదర్శన ఆకట్టుకుంది.
మాదాపూర్: హైదరాబాద్ నగరం గ్లోబల్ గమ్యస్థానంగా మారుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ‘ఐఐఐడీ షోకేస్ ఇన్‌సైడర్ ఎక్స్’ను ఆయన ప్రారంభించారు.
ఈ ప్రదర్శన ద్వారా ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, డెవలపర్లు, బిల్డర్లు, ఇంటి యజమానులు అవగాహన పెంచుకోవచ్చన్నారు.
దేశవ్యాప్తంగా 11వేల మందికి పైగా నిపుణులను ఒకచోటుకు చేర్చే అగ్రగామి డిజైన్ సంస్థ ఐఐఐడీ అన్నారు. 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొనడంతోపాటు 300కు పైగా ప్రముఖ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు.


