పడిపోయిన పీడనం.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం

Muscat to Calicut  Air India Express passengers suffers nose bleeding - Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. మస్కట్‌ నుంచి కాలికట్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం ఆకాశంలో ఉండగానే ఒక్కసారిగా పీడనం తగ్గిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. విమానంలో పీడనం తగ్గడంతో నలుగురు ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం కారగా, మరికొందరు చెపి నొప్పితో ఇబ్బంది పడ్డారు.  ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 737-8 రకానికి చెందిన IX - 350 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రయాణికులు అస్వస్థతకు గురవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని మస్కట్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ప్రయాణికులకు విమానాశ్రయంలో వైద్య చికిత్స అందించారు. ప్రయాణికులు కోలుకున్న తర్వాత విమానం కాలికట్‌ బయల్దేరింది. క్యాబిన్‌లో పీడన సమస్య ఏర్పడటంతో ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు ఎయిర్‌ఇండియా ప్రతినిధి తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top