దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర: మోడీ | Young people have guts, encourage them: Narendra Modi | Sakshi
Sakshi News home page

దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర: మోడీ

Aug 11 2013 3:55 PM | Updated on Sep 4 2018 5:07 PM

తాను ముఖ్యమంత్రిగా పని చేయలేదని, తాను ఏర్పాటు చేసిన వ్యవస్థే గుజరాత్ అభివృద్ధికి దోహదం చేసిందని బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

హైదరాబాద్: తాను  ముఖ్యమంత్రిగా పని చేయలేదని, తాను ఏర్పాటు చేసిన వ్యవస్థే గుజరాత్ అభివృద్ధికి దోహదం  చేసిందని  బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పార్క్ హయత్ హొటల్లో తనను కలిసిన తెలుగు సినీ ప్రముఖులతో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. తన విజయంలో ఆరు కోట్ల గుజరాతీయుల పాత్ర ఉందన్నారు.

మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు, గుజరాత్ పని అయిపోయిందని, ఇక ఆ రాష్ట్రం వెనుకబడిపోతుందని అన్నారన్నారు. కానీ ఇప్పుడు గుజరాత్ ఎంత అభివృద్ధి చెందిందో చూడవచ్చని చెప్పారు. గుజరాత్లో వ్యాపారాలు చేసేవారిలో 30 శాతం మంది ఆంధ్ర ప్రదేశ్ వారే ఉన్నట్లు తెలిపారు. యువత వద్ద దమ్ము ఉందని, వారిని ప్రోత్సహించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement