'ఈ చేతులతోనే మొగుడిని చంపేశాను...' | Woman admits to killing hubby in a TV show | Sakshi
Sakshi News home page

'ఈ చేతులతోనే మొగుడిని చంపేశాను...'

Apr 30 2014 5:35 PM | Updated on Jul 30 2018 8:27 PM

'ఈ చేతులతోనే మొగుడిని చంపేశాను...' - Sakshi

'ఈ చేతులతోనే మొగుడిని చంపేశాను...'

ఉంచుకున్న వాడి కోసం ఉన్నవాడిని చంపేసుకుంది ఆమె. ఉంచుకున్న వాడు ఇప్పుడు మోసం చేశాడు. దాంతో అక్కసు పట్టలేక ఆమె పాత హత్య కథంతా కక్కేసింది. అదే టీవీ ఛానెల్ స్టుడియోలో.

ఉంచుకున్న వాడి కోసం ఉన్నవాడిని చంపేసుకుంది ఆమె. ఉంచుకున్న వాడు ఇప్పుడు మోసం చేశాడు. దాంతో అక్కసు పట్టలేక ఆమె పాత హత్య కథంతా కక్కేసింది. అదే టీవీ ఛానెల్ స్టుడియోలో. దాంతో ఇప్పుడామె, ఆమె లవర్ అరెస్టై కటకటాలు లెక్కిస్తున్నారు.

తమిళనాడులో బేబీకళ అనే మహిళ రాధాకృష్ణన్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఆ తరువాత బేబీకళ గౌరీశంకర్ అనే యువకుడిపై మనసు పడింది. బేబీకళ, గౌరీశంకర్ లు కలిసి రాధాకృష్ణన్ కు మద్యం బాగా తాగించి, ప్లాస్టిగ్ బ్యాగ్ తో ఊపిరందకుండా నొక్కి చంపేశారు. ఆ తరువాత రాధాకృష్ణన్ గుండెపోటుతో చనిపోయారని నమ్మబలికారు. రాధాకృష్ణన్ అంత్యక్రియలు కూడా అయిపోయాయి. ఇదంతా నాలుగేళ్ల కిందటి సంగతి.

నాలుగేళ్ల తరువాత గౌరీశంకర్ బేబీకళను వదిలేసి, ఇంకో అమ్మాయి వెంట పడటం మొదలుపెట్టాడు. దీంతో బేబీకళ భగ్గుమంది. కోపం పట్టలేక ఓ టీవీ స్టుడియోకి చేరుకుని ఆమె తన నిర్వాకాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement