లంచం కేసులో మేజిస్ట్రేట్ అరెస్ట్ | Sp Metropolitan Magistrate arrested on bribery | Sakshi
Sakshi News home page

లంచం కేసులో మేజిస్ట్రేట్ అరెస్ట్

Aug 18 2015 5:25 PM | Updated on Aug 20 2018 4:27 PM

లంచం కేసులో మేజిస్ట్రేట్ అరెస్ట్ - Sakshi

లంచం కేసులో మేజిస్ట్రేట్ అరెస్ట్

ఓ షాపు యజమాని నుంచి 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఢిల్లీ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్పీ భాటియాను సీబీఐ అరెస్ట్ చేసింది.

న్యూఢిల్లీ: ఓ షాపు యజమాని నుంచి 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఢిల్లీ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్పీ భాటియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆర్పీ భాటియాను పట్టుకున్నారు.

ఇటీవల లజపత్ నగర్లో తనిఖీల సందర్భంగా ఆర్పీ భాటియా.. షాపు యజమానికి చలానా వేసి కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ చలానాను రద్దు చేయాలంటే 60 వేల రూపాయలు లంచం ఇవ్వాలని అనంతరం డిమాండ్ చేశారు. చివరకు 25 వేల రూపాయలు లంచం తీసుకునేందుకు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ మాటువేసి మేజిస్ట్రేట్ను అదుపులోకి తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement